Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో పలుచోట్ల వడగళ్ల వాన

  • ఎండలతో ఇబ్బంది పడుతోన్న హైదరాబాదీయులకు ఉపశమనం
  • ఆసిఫ్ న‌గ‌ర్, లంగ‌ర్ హౌస్, మెహిదీ ప‌ట్నం, గుడిమ‌ల్కాపూర్‌లో వాన
  • ఇబ్ర‌హీం ప‌ట్నంలో ఈదురుగాలుల‌తో ‌వడగ‌ళ్ల వాన‌
ఎండలతో ఇబ్బందులు ఎదుర్కుంటోన్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఎండలతో ఉక్కపోతను చవిచూసిన నగరవాసులు ప్రస్తుతం చల్లని వాతావరణంలో సేద తీరుతున్నారు. మరోవైపు హైద‌రాబాద్‌లోని పలు చోట్ల వడగాళ్ల వాన పడుతోంది. నగరంలోని ఆసిఫ్ న‌గ‌ర్, లంగ‌ర్ హౌస్, మెహిదీ ప‌ట్నం, గుడిమ‌ల్కాపూర్ ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్లతో కూడిన వర్షం పడుతోంది. హైద‌రాబాద్ శివారులోని ఇబ్ర‌హీం ప‌ట్నంలో ఈదురుగాలుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కురుస్తోంది. తెలంగాణలోని సిద్ధిపేట ప‌ట్ట‌ణంలోనూ వ‌డ‌గ‌ళ్ల వాన పడుతోంది. 
rain
Hyderabad

More Telugu News